: సరసానికి పంపితే...సంహరించింది


సంతాన భాగ్యం కోసం సరసానికి పంపితే సరసం సంగతి ప్రక్కన పెట్టి, ఘర్షణకు దిగి చంపేసింది. ఢిల్లీ జూలో పులుల సంతతిని పునరుద్ధరించేందుకు మైసూర్ నుంచి మగపులిని తీసుకొచ్చారు జూ అధికారులు. మైసూర్ నుంచి తీసుకువచ్చిన పులితో సంసారానికి జిన్ జిన్ అనే పదేళ్ల పులిని బోనులోకి వదిలారు జూ అధికారులు. తీరా అక్కడికి రెండూ చేరుకున్న తరువాత సరసానికి బదులు పోరాటానికి దిగాయి.

విషయం గుర్తించిన జూ సిబ్బంది పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఇంతలోనే జిన్ జిన్ ను దొరకబుచ్చుకున్న మగపులి చంపేసింది. దీంతో ఢిల్లీ జూలో ఐదు పులులే మిగిలాయి. వీటిలో రెండు ఆడ, మూడు మగ రాయల్ బెంగాల్ పులులు ఉన్నాయి. అడవుల్లో ఇలాంటి ఘటనలు సాధారణమేనని, జూల్లో మాత్రం అరుదుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయని జూ క్యూరేటర్ రియాజ్ ఖాన్ తెలిపారు.

  • Loading...

More Telugu News