: ఇవాళ, రేపు 6 ఎక్స్ ప్రెస్, 24 ప్యాసింజర్ రైళ్ల రద్దు


మరమ్మత్తుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6 ఎక్స్ ప్రెస్, 24 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇవాళ బెంగళూరు-నాగర్ కోయల్, తిరుపతి-ఆదిలాబాద్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దయ్యాయి. రేపు నాగర్ కోయల్-బెంగళూరు, ఆదిలాబాద్-నాందేడ్, నాందేడ్-ఆదిలాబాద్, ఆదిలాబాద్-తిరుపతి మధ్య నడిచే రైళ్లను రద్దు చేశారు. అలాగే 24 ప్యాసింజరు రైళ్లను కూడా రద్దు చేశారు. గుంటూరు-తిరుపతి, తిరుపతి-నెల్లూరు, తిరుపతి-గూడూరు, గూడూరు-తిరుపతి, నెల్లూరు-సూళ్లూరుపేట, సూళ్లూరుపేట-నెల్లూరు, చెన్నై-గూడూరు, గూడూరు-విజయవాడ, బిట్రగుంట-చెన్నై, నెల్లూరు-చెన్నై, చెన్నై-తిరుపతి, తిరుపతి-చెన్నై ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయి.

  • Loading...

More Telugu News