: ఆస్ట్రేలియా విమానం హైజాక్ అసలు కథ ఇది


ఆస్ట్రేలియాకు చెందిన విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించారంటూ... ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో డెన్ పసార్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేసిన సంగతి తెలిసిందే. అయితే విమానం హైజాక్ కు గురి కాలేదు సరికదా అదంతా ఓ వ్యక్తి నిర్వాకం అని దర్యాప్తులో తేలింది. మాట్ క్రిస్టఫర్ లాక్లీ అనే ప్రయాణికుడిని అతడి భార్య వదిలేసింది. దీంతో అతను డిప్రెషన్ కు గురయ్యాడు. భార్యను వెతుక్కుంటూ ఇండోనేషియా బయల్దేరాడు. డిప్రెషన్ పోగొట్టుకునేందుకు కొన్ని మందులు వేసుకున్నాడు. రెండు కోక్ లు తాగేశాడు. అవి విమానంలో పని చేయడం ప్రారంభించాయి.

దీంతో టాయిలెట్ అనుకుని కాక్ పిట్ తలుపులు తెరవబోయాడు. అవి తెరుచుకోకపోవడంతో దబదబా బాదేశాడు. దీంతో పైలట్ అప్రమత్తమై గ్రౌండ్ స్టేషన్ కు సమాచారం అందించి అత్యవసరంగా విమానాన్ని దించేశాడు. అనంతరం భద్రతాధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతను తీవ్రవాది కాదని, మూత్రశాల అనుకుని కాక్ పిట్ లో దూరేందుకు ప్రయత్నించాడని నిర్ధారించారు.

  • Loading...

More Telugu News