: ఆ ఐదు సంతకాలతో రాష్ట్ర దశ, దిశ మార్చేస్తా: జగన్


ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రచారంలో స్పీడుని పెంచారు. ప్రచారంలో భాగంగా ఆయన ఇవాళ నల్గొ్ండ జిల్లా కోదాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎంచుకోవాలో ఎవరికి వారే ప్రశ్నించుకోవాలని జగన్ ప్రజలకు సూచించారు. ఏ వ్యక్తి అయితే ప్రజల గుండెల్లో నిలిచి ఉంటాడో.. అలాంటి వాడినే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలన్నారు. చాలామంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు... కానీ ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్ లాగా ఉండాలనుకునేలా వైఎస్ పాలన సాగిందని జగన్ చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే... రాష్ట్ర దశ, దిశ మార్చే విధంగా ఐదు సంతకాలు చేస్తానని జగన్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News