: తమ్ముడు బీజేపీలో చేరడంపై ప్రధాని విచారం
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమక్షంలో తమ్ముడు దల్జీత్ సింగ్ కోహ్లీ నిన్న బీజేపీలో చేరడంపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, 'దల్జీత్ విషయంపై చాలా బాధగా ఉంది. వారిపై ఎలాంటి నియంత్రణ లేదు. వారందరూ పెద్దవారు' అని ఢిల్లీలోని పద్మ అవార్డుల కార్యక్రమంలో స్పందించారు.