: వారణాసిలో వీరప్పన్ మేనల్లుడు, లాడెన్ పోలికల వ్యక్తి నామినేషన్ల తిరస్కరణ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్న వారణాసిలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. వారణాసి స్థానానికి వివిధ పార్టీలు, వ్యక్తుల నుంచి 78 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 34 నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. మే 12న జరుగనున్న వారణాసి ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్ 28.
కాగా ఈ ఎన్నికల్లో నామినేషన్ వేసిన స్మగ్లర్ వీరప్పన్ మేనల్లుడు పి.ఎస్.రామచంద్రన్, ఒసామా బిన్ లాడెన్ పోలికలతో ఉండే మీర్జా ఖలీద్ నూర్ నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కాగా మోడీ పేరుతో ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.