: మతం మార్చుకున్న సెలబ్రిటీలను చూద్దాం
పెళ్లి కోసమో, మరో కారణం కోసమో మతం మార్చుకున్న సెలబ్రిటీల గురించి వినే ఉంటాం. అలాంటి వారిలో షర్మిలాఠాగూర్ ఒకరు. నవాబ్ మన్సూర్ అలీఖాన్ పటౌడీని పెళ్లాడేందుకు ఆమె ఇస్లాం మతం స్వీకరించారు. తర్వాత బేగం అయేషాగా పేరు మార్చుకున్నారు. 90లలో పేరొందిన నటి మమతా కులకర్ణి, తన భర్త విక్కీ గోస్వామితోపాటు ఇస్లాం మతం స్వీకరించారు. హేమమాలిని భర్త ధర్మేంద్ర కూడా హిందువు అయినప్పటికీ ఇస్లాంలోకి వెళ్లిపోయారు. సిక్కు మతానికి చెందిన అమృతా సింగ్ సైఫ్ అలీఖాన్ ను పెళ్లాడేందుకు ఇస్లాం మతం స్వీకరించారు. ఆ తర్వాత ఆమె సైఫ్ తో విడిపోవడం తెలిసిందే. గాయకుడు హన్స్ రాజ్ కూడా సిక్కు మతస్థుడైనా, ఇస్లాం మతంపై ఆసక్తితో అందులోకి వెళ్లిపోయారు.