: అరకులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయమ్మ
ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ రాజకీయ పక్షాల అగ్రనేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్, విజయమ్మ, షర్మిల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవధ్యక్షురాలు విజయమ్మ ఇవాళ అరకు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో విజయమ్మ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించి జగన్ ను సీఎంను చేయాలని కోరారు. అధికారంలోకి రాగానే జగన్ ఐదు సంతకాలతో ప్రజలకు మెరుగైన పాలనను అందిస్తారని విజయమ్మ హామీ ఇచ్చారు.