: కేసీఆర్ టీ న్యూస్ ఉద్యోగులకు పీఎఫ్ ఇవ్వలేదు: శ్రవణ్
టీ న్యూస్ ఉద్యోగులకు పీఎఫ్ కూడా ఇవ్వని కేసీఆర్ ఉద్యోగుల భద్రతను ఎలా కాపాడతారని తెలంగాణ కాంగ్రెస్ నేత శ్రవణ్ ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీ న్యూస్ చానెల్ జర్నలిజం విలువలను దిగజార్చిందని మండిపడ్డారు. టీ న్యూస్ ప్రసారం చేస్తున్న వార్తలను పెయిడ్ ఆర్టికల్స్ గా గుర్తించాలని ఆయన ఈసీని కోరారు. టీఆర్ఎస్ అసలైన ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.