: మడకశిరలో రోడ్డు బాట పట్టిన బాలకృష్ణ
అనంతపురం జిల్లా మడకశిరలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం సినీ హీరో, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి ఆయన మడకశిర టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ఈరన్నకు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. బాలయ్య రోడ్ షో కు పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. అనంతరం గుడిబండలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో బాలకృష్ణ పాల్గొననున్నారు.