: రాజ్ నాథ్ సింగ్ కు ఎన్డీ తివారీ మద్దతు
కాంగ్రెస్ పార్టీ వృద్ధ నేత, మన రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ... బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కు తన మద్దతు ప్రకటించారు. రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు లక్నోలో తివారీతో సమావేశమయ్యారు. లక్నో నుంచి రాజ్ నాథ్ లోక్ సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 'ఆయన రాజు. ఈ రోజు వచ్చారు. ఆయనకు నా మద్దతు ఉంది' అని సమావేశం అనంతరం తివారీ ప్రకటించారు. రాజ్ నాథ్ మాట్లాడుతూ... 'యూపీ విధాన సభకు తొలిసారి ఎన్నికైనప్పుడు తివారీ నా వద్దకు వచ్చి నీకు రాష్ట్రంలో మంచి భవిష్యత్తు ఉందని దీవించారు' అని చెప్పారు. అయితే, భిన్న పార్టీల అగ్రనేతలు ఇలా కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.