: సైఫ్ అలీ ఖానూ.. ఓ నష్టనివారణ చర్య..!
తాజా చిత్రం 'గో గోవా గాన్' లో సిగరెట్ తాగుతూ పోస్టర్లకెక్కిన బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై పలు విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. సైఫ్ చర్యతో అభిమానుల్లో సైతం పొగ తాగాలన్న కోరిక బయల్దేరుతుందని ఓ సామాజిక సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో సైఫ్ నష్ట నివారణ చర్యకు ఉపక్రమించాడు. ఈ క్రమంలో ఓ పొగాకు వ్యతిరేక చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో, పొగ తాగితే వచ్చే అనర్థాల గురించి వివరిస్తారట. కాగా, ఈ వీడియో చిత్రాన్ని 'గో గోవా గాన్' సినిమా ప్రారంభానికి ముందు ప్రదర్శిస్తారని సమాచారం. సైఫ్ 'గో గోవా గాన్' మూవీలో రష్యన్ మాఫియా డాన్ 'బోరిస్' గా నటిస్తున్నాడు.