: ఈ సెలబ్రిటీలు ఓటు హక్కును వృథా చేశారు


నోరు తెరిస్తే సామాజిక బాధ్యత గురించి ఉపన్యాసాలు వినిపిస్తుంటారు సెలబ్రిటీలు. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రతీ ఒక్కరినీ చైతన్యపరిచేందుకు తమవంతు ప్రయత్నించారు. కానీ, తీరా పోలింగ్ రోజు వచ్చేసరికి వారి అసలు తత్వం బయటపడింది. వారికి షోకులు, ప్రచారం, డబ్బే పరమావధి అన్న విషయం తేలిపోయింది. విలువైన ఓటును వృథా చేసుకుని మరీ బాలీవుడ్ నటీనటులు ఎంతో మంది ఫ్లోరిడాలోని టంపాబేలో జరుగుతున్న ఐఐఎఫ్ఏ సినిమా సంబరాలకు వెళ్లిపోయారు. మరికొందరు షూటింగ్ కోసం ఓటింగ్ కు డుమ్మా కొట్టారు. అలాంటి వారిలో కరీనాకపూర్, షాహిద్ కపూర్, దీపికా పదుకునే, ప్రియాంకచోప్రా, అనిల్ కపూర్, హృతిక్ రోషన్, అలియాభట్, వివేక్ ఒబేరాయ్ తదితరులు ఉన్నారు.

తన తండ్రి శత్రుఘ్న సిన్హా బీజేపీ తరపున లోక సభకు పోటీ చేస్తున్నప్పటికీ సోనాక్షి ఓటేయకుండా టంపాబేలో వాలిపోయింది. సైఫ్, కరీనా కూడా ఐఐఎఫ్ఏ ఉత్సవాలకు వెళ్లారు. సల్మాన్ అయితే పోలండ్ లో షూటింగ్ లో ఉండిపోయాడు. షబానా అజ్మి, జావేద్ అక్తర్ కూడా టంపాబేకే ప్రయాణం కట్టారు. అనుష్కశర్మ ఎన్ హెచ్ 10 షూటింగ్ కానిచ్చేసింది. కొత్తగా పెళ్లి చేసుకున్న రాణీ ముఖర్జీ కూడా ఓటింగ్ కు దూరంగానే ఉన్నారు. కత్రినాకు ఓటు హక్కు లేదు. వర్క్ వీసాపై ఆమె భారత్ లో పనిచేసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News