: కాంగ్రెస్ నేతలు నైరాశ్యం, నిస్పృహలో ఉన్నారు: వెంకయ్య నాయుడు
ప్రస్తుతం దేశంలో మోడీ హవా ఉందని... ఆయనను ప్రధాని కాకుండా ఎవరూ ఆపలేరని బీజేపీ జాతీయనేత వెంకయ్య నాయుడు తెలిపారు. ఓటమి తప్పదన్న నైరాశ్యం, నిస్పృహలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ కు మద్దతిచ్చే పార్టీలకు ఓటు వేయరాదని ఓటర్లను కోరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ లు నాటకాలాడుతున్నాయని... వీరికి ఓటు వేసే విషయంలో తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెంకయ్య అన్నారు. ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.