: దోమలపై సమరానికి మొబైల్ అప్లికేషన్ సాయం


దోమలపై పోరాటం చేయడానికి దోమల బ్యాట్, ఓ ఆల్ అవుట్, ఓ దోమ తెర ఉంటే చాలనుకుంటున్నారా? కానీ, చెన్నై నగర మునిసిపల్ కార్పొరేషన్ మాత్రం ఆధునిక టెక్నాలజీ సాయంతో దోమలపై సమరానికి మొబైల్ అప్లికేషన్ సాయం కూడా అవసరం అంటోంది. చెన్నైలో ఇంటింటికీ తిరిగి దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకునేందుకు కార్పొరేషన్ 5వేల మంది పనివారిని రంగంలోకి దింపింది. వారు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? వంటి వివరాలను సమన్వయపరిచేందుకు కార్పొరేషన్ ఓ మొబైల్ అప్లికేషన్ ను రూపొందించింది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో ఇప్పటివరకు తెలిసేది కాదని, రికార్డు కూడా లేదని, ఇప్పుడు ఈ అప్లికేషన్ తో అది సాధ్యమవుతుందని కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News