: చనిపోయిన మహిళను వెంటిలేటర్ పై వారం పాటు ఉంచిన వైద్యులు!
డబ్బులు దండుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులు చేస్తున్న ట్రిక్కులు అన్నీ ఇన్నీ కావు. అందుకే ఆసుపత్రికి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే చనిపోయిన ఓ మహిళ బతికే ఉందంటూ వెంటిలేటర్ పై వారం పాటు ఉంచారు నలుగురు వైద్యులు. చివరికి అసలు విషయం తెలియడంతో పరారయ్యారు. అత్యంత హేయమైన ఈ ఘటన భోపాల్లో చోటు చేసుకుంది. డబ్బుకోసం తమను చీట్ చేశారంటూ డాక్టర్లపై కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ సమయంలో ఆసుప్రతికి తాము ఆరు లక్షల బిల్లు చెల్లించామని చెప్పారు. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం. ప్రస్తుతం వైద్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.