: పీఎం సోదరుడు బీజేపీలో చేరడంపై కుటుంబసభ్యుల అసంతృప్తి


ప్రధాని మన్మోహన్ సింగ్ సోదరుడు దల్జీత్ సింగ్ కోహ్లీ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. దానిపై ఆయన కుటుంబ సభ్యులు స్పందిస్తూ, దల్జీత్ నిర్ణయంపై తాము చాలా బాధతో ఉన్నట్లు తెలిపారు. భారత్ వృద్ధి చెందేందుకు కృషి చేసిన మన్మోహన్ చాలా నిజాయతీ పరుడని, అందుకు చాలా గర్వంగా ఉందని మనవడు రణదీప్ సింగ్ పేర్కొన్నాడు. దల్జీత్ తీసుకున్న నిర్ణయంపై తాము షాక్ అయ్యామని, అయినా కుటుంబమంతా ఇప్పటికీ మన్మోహన్ కే మద్దతు తెలుపుతుందని పీఎం సోదరుని కుమారుడు మన్దీప్ సింగ్ కోహ్లీ తెలిపాడు. దల్జీత్ తన రాజకీయ జీవితంపై స్వతంత్రంగా ఉండొచ్చని... అయితే, కుటుంబం మాత్రం ఈ విషయంపై ఆశ్చర్యం చెందిందని ప్రధాని కార్యాలయానికి చెందిన ఒకరు అన్నారు.

  • Loading...

More Telugu News