: మోడీ పీఎం పీఠమెక్కితే జైట్లీకి కీలక పదవి
ఎన్నికల అనంతరం ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడి ప్రధాని పీఠంపై మోడీ కూర్చుంటే అరుణ్ జైట్లీకి కీలక పదవి దక్కనుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని మోడీయే పరోక్షంగా చెప్పారు. పంజాబ్ లో నిన్న జరిగిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ జైట్లీ కేంద్ర ప్రభుత్వానికి విలువైన ఆస్తిగా పేర్కొన్నారు. ఢిల్లీలో తమ ప్రభుత్వానికి జైట్లీ సాయం చేస్తారని వ్యాఖ్యానించారు. తద్వారా పంజాబ్ లో బాదల్ సర్కారుకు కూడా సాయపడతారని తెలిపారు. దీన్నిబట్టి చూస్తే జైట్లీ కేంద్ర ప్రభుత్వంలో భాగం కానున్నారని మోడీ ముందుగానే సంకేతాలు ఇచ్చినట్లయింది.