: చిరు ఏడాదికి అమ్మేస్తే... పవన్ కొన్ని రోజులకే అమ్మేశాడు: ఆదిశేషగిరిరావు
ఇటీవల వైఎస్సార్సీపీలో చేరిన నిర్మాత ఆదిశేషగిరిరావు ఆ పార్టీకి తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమన్నారు. ఓటమి భయం చంద్రబాబు కళ్లల్లో కనిపిస్తోందని, సీమాంధ్రకు అన్యాయం చేసింది ఆయనేనని ఆరోపించారు. ఇక కేంద్ర మంత్రి చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన శేషగిరిరావు... ఏం చూసి బీజేపీకి పవన్ మద్దతిస్తున్నారో చెప్పాలన్నారు. అన్న చిరు పార్టీ పెట్టిన సంవత్సరానికి అమ్మేస్తే... తమ్ముడు పవన్ కొన్ని రోజులకే పార్టీని అమ్మారని తీవ్రంగా విమర్శించారు.