: అవకాశం ఇప్పిస్తానంటూ మోడల్ పై బాలీవుడ్ నటుడు అత్యాచారం


సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ ఓ మోడల్ పై అత్యాచారం చేసిన బాలీవుడ్ నటుడు ఇందర్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం 23 ఏళ్ల మోడల్ ను ముంబై, అంధేరీలోని తన నివాసానికి పిలిపించుకున్న ఇందర్ కుమార్ తొలుత బీర్ బాటిల్ తో కొట్టాడు. అలాగే బాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రలు ఇప్పిస్తానంటూ అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు వెర్సోవా సీనియర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ హరిచంద్రపమేలా తెలిపారు.

ఈ ఘటన జరగడానికి ముందు ఇందర్ కుమార్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆయన భార్య గురువారం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అప్పుడు ఇందర్ కుమార్ కూడా స్టేషన్ కు వచ్చి భార్యతో సర్దుబాటు చేసుకుని తిరిగి వెళ్లిపోయారని వివరించారు. అనంతరం మోడల్ ను తన ఇంటికి పిలిపించుకున్న ఇందర్ కుమార్ ఆమెపై అత్యాచారం వేధింపులకు పాల్పడినట్లు తెలిపారు. మొత్తానికి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇందర్ కుమార్ ను అరెస్ట్ చేశారు. అతడు వాంటెడ్, మా తుజేసలామ్, కిలాడియోన్ కా కిలాడీ, బాఘీ తదితర చిత్రాల్లో నటించాడు.

  • Loading...

More Telugu News