: నేడు చంద్రబాబు పర్యటన వివరాలు
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కాసేపట్లో ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు. 11 గంటలకు అలంపూరు నియోజకవర్గంలోని అయిజలో, మధ్యాహ్నం 12 గంటలకు అచ్చంపేటలో, 3 గంటలకు జడ్చర్లలో నిర్వహించే సభల్లో ఆయన ప్రసంగిస్తారు.