: సెట్ టాప్ బాక్స్ లకు 3నెలలు గడువివ్వండి : వామపక్షాలు


టీవీ ప్రసారాలను డిజిటలైజేషన్ చేయాలనే క్రమంలో నిన్న అర్థరాత్రి నుంచి కేంద్రం కేబుల్ ప్రసారాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనిని నిరసిస్తూ  ఇవాళ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు ఈ అంశంపై కేంద్రానికి లేఖ రాశాయి. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు సెట్ టాప్ బాక్స్ లు ఏర్పాటు చేసుకునేందుకు 3నెలలు గడువివ్వాలని కోరారు. 

  • Loading...

More Telugu News