: ఐపీఎల్-7లో తొలి విజయాన్ని అందుకున్న హైదరాబాద్ సన్ రైజర్స్
ఐపీఎల్ -7లో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో హోరాహోరీగా జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు విజయ తీరానికి చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి 184 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఫించ్ (88), వార్నర్ (58) ధాటిగా ఆడటంతో హైదరాబాదు జట్టు మంచి స్కోరును సాదించింది. అనంతరం బ్యాటింగ్ ను ప్రారంభించిన ఢిల్లీ విజయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో సన్ రైజర్స్ జట్టు ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందుకొంది.