: టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీపై విమర్శలు సంధించిన రాహుల్ గాంధీ


టీఆర్ఎస్, బీజేపీ, టీడీపీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు సంధించారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ, టీడీపీ తెలంగాణ రాకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు. గత పదేళ్లలో వివిధ కార్యక్రమాల రూపంలో మత విద్వేషాలు రేపేందుకు టీఆర్ఎస్ ప్రయత్నించిందని అన్నారు. అన్ని ప్రాంతాల ప్రజలంతా కలసి హైదరాబాద్ ను అభివృద్ధి చేశారని ఆయన అన్నారు.

హైదరాబాద్ అందరి నగరమని, ఏ ఒక్కరికో చెందిన నగరం కాదని గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. దేశంలో, తెలంగాణలో ఏ వస్తువు కొనుగోలు చేసినా మేడిన్ చైనా అని కనబడుతోందని. ఆయా వస్తువులు కొన్నప్పుడు కట్టే రుసుం చైనాకు వెళ్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ రంగంలో నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. అయితే భవిష్యత్ లో హార్డ్ వేర్ రాజధానిగా కూడా ఏర్పాటు కావాలని ఆయన ఆకాంక్షించారు.

భవిష్యత్ లో దేశంలో ఏ వస్తువు కొన్నా మేడిన్ హైదరాబాద్ అని ఉండాలని ఆయన స్పూర్తిని రగిలించారు. అందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలను అనుసంధానం చేస్తూ హార్డ్ వేర్ కారిడార్ రూపకల్పన చేశామని ఆయన చెప్పారు. తనకు కూడా మేడిన్ తెలంగాణ వాచ్ పెట్టుకోవాలనే కోరిక వుందని ఆయన నవ్వుతూ అన్నారు. తనకు మేడిన్ తెలంగాణ వాచ్ కావాలని అన్నారు. మౌలిక సదుపాయలతో జాతీయ స్థాయి రవాణా సౌకర్యాన్ని రూపొందించామని ఆయన తెలిపారు.

తెలంగాణలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రూపొందిస్తామని ఆయన అన్నారు. రానున్న ఐదేళ్లలో మూడు లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మెట్రో రైలు రూపకల్పన కాంగ్రెస్ పార్టీ చేసిందని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ ను అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపుదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీదని రాహుల్ గాంధీ తెలిపారు.

  • Loading...

More Telugu News