: రాహుల్ సభలో వీహెచ్ కు అవమానం
గాంధీ కుటుంబానికి వీరవిధేయుడు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావుకు ఘోర అవమానం జరిగింది. ఎల్బీస్టేడియంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగ సభ వేదిక వద్దకు హనుమంతరావు చేరుకున్నారు. వేదికపైకి వెళ్లేందుకు ఆయన సమాయత్తమవగా, పోలీసులు ఆయనను వారించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతను, ఎంపీని అని చెప్పినప్పటికీ ఆయనను వేదికపైకి అనుమతించలేదు. దీంతో ఆయన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ ఆయనను అనుమతించకపోవడంతో ఆగ్రహించి విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోయారు.