: కేసీఆర్ పై గులాంనబీ ఆజాద్ ఫైర్


టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ మండిపడ్డారు. తెలంగాణ కోసం పార్లమెంటులో ఎప్పుడైనా మాట్లాడావా? అని ఆజాద్ కేసీఆర్ ని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎంపీతోనే తెలంగాణ సాధించావా? అని ఆయన కేసీఆర్ ను నిలదీశారు. ఒక ఎంపీతోనే తెలంగాణ వచ్చిందంటే అంతకన్నా అసత్యమేమీ ఉండదని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం అందరూ ఉద్యమిస్తుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ వల్లే వచ్చిందన్న విషయం ఇకనైనా గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు.

  • Loading...

More Telugu News