: హైదరాబాదు-బెంగళూరు బస్సులో 8 కోట్లు స్వాధీనం
హవాలా కార్యకలాపాలు హైదరాబాదులో జోరుగా జరుగుతున్నట్లు నగర పోలీసులకు తెలియడంతో వెంటనే తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాదు-బెంగళూరు బస్సులో రూ.8.3 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.