: బాబుకు నిమ్మరసం ఇచ్చారు
విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ఒకరోజు దీక్ష ఈ సాయంత్రం ముగిసింది. కాకినాడ జేఎన్టీయూ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆయన సాగించిన దీక్ష.. స్థానిక చిన్నారులు నిమ్మరసం ఇవ్వడంతో ముగిసింది. అనంతరం బాబు మాట్లాడుతూ, విద్యుత్ ఛార్జీల పెంపుపై ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలు సంతకాలు సేకరించాలని సూచించారు. ఈ సంతకాల ఉద్యమం రేపటి నుంచి ప్రారంభం అవుతుందని బాబు చెప్పారు.