: అనేక చట్టాలు రాహుల్ వల్లే వచ్చాయి: బలరాం నాయక్


ఆర్టీఐ సహా అనేక చట్టాలు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వల్లే వచ్చాయని కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. వరంగల్ లో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీదేనని అన్నారు. అందుకే రాహుల్ గాంధీని ప్రధానిని చేసి కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలని ఆయన తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News