: అనంత పద్మనాభుడి ఆస్తి లెక్కించడం అంత సులువు కాదు: వినోద్ రాయ్
అనంతమైన సంపద కలిగిన తిరువనంతపురం పద్మనాభుడి ఆస్తులను లెక్కించడం అంత సులుపైన విషయం కాదని మాజీ కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ అన్నారు. ఆలయ సంపదను ఆడిటింగ్ చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు... పర్యవేక్షణ బాధ్యతను వినోద్ రాయ్ కు అప్పగించింది. సుప్రీంకోర్టు అప్పగించిన బాధ్యతను మనస్పూర్తిగా చేపడుతున్నానని రాయ్ తెలిపారు.