: రాళ్లు విసిరి రచ్చ చేసిన బీజేపీ అభ్యర్థి... కేసు నమోదు
భారతీయ జనతాపార్టీ ఫిరోజాబాద్ లోక్ సభ అభ్యర్థి ఎస్పీ సింగ్ బగేల్ గురువారం నాడు చేపట్టిన ఓ ధర్నాలో రాళ్లు విసిరి, అల్లర్లు చేశారని... అంతే కాకుండా ఓ పోలీసు వాహనానికి నిప్పంటించారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సింగ్ బగేల్ తో పాటు మరో 500 మంది కార్యకర్తల పైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. అల్లర్లు చేయడం, దాడులకు దిగడం, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడం వంటి అనేక సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
గత రాత్రి బగేల్ తన మద్దతుదారులతో కలసి పోలింగ్ ను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ఆ సమయంలో ఆయన మద్దతుదారులు దాడులకు దిగారు, పోలీసులపై రాళ్లు విసిరారు. ఎస్పీ, అధికారులు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ అల్లర్లకు పూనుకున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.