: సోనియా తెలంగాణ తల్లి: జైరాం రమేష్
సోనియా గాంధీ తెలంగాణ తల్లి అని కేంద్ర మంత్రి జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ లో ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే వచ్చేది దొరల రాజ్యమని, అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే రైతు రుణాలు మాఫీ చేస్తామని జైరాం హామీ ఇచ్చారు.