: హైదరాబాదు నుంచి వరంగల్ బయల్దేరిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్ది సేపటి క్రితం హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ సీనియర్ నేత వాయలార్ రవి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్ లో నేరుగా వరంగల్ కు బయల్దేరి వెళ్లారు. వరంగల్లులో జరుగనున్న బహిరంగసభలో ఆయన పాల్గొని, ప్రసంగించనున్నారు.