: వాజ్ పేయి పాలనలోనే దేశాభివృద్ధి: మోడీ
అటల్ బిహారీ వాజ్ పేయి పాలనలోనే భారత్ అభివృద్ధి జరిగిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. పంజాబ్, పఠాన్ కోట్ లో మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ... భారతీయ జనతాపార్టీ పాలనలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుందని అన్నారు. అలాగే ఇప్పుడు వ్యవసాయానికి నీటి వసతి కల్పించే పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన చెప్పారు. దేశంలోని యువశక్తిని కాపాడుకోవడం మన బాధ్యత అని మోడీ అన్నారు.