: 1200 మంది చావుకు సోనియానే కారణం: మందా
తెలంగాణ ఉద్యమంలో 1200 మంది ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియానే బాధ్యత వహించాలని టీఆర్ఎస్ నేత మందా జగన్నాథం డిమాండ్ చేశారు. సోనియా మొండి వైఖరి వల్లే ఇంత మంది ప్రాణాలు అర్పించాల్సి వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది సంపూర్ణ తెలంగాణ కాదని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం టీఆర్ఎస్ తోనే సాధ్యమని చెప్పారు.