: ఫోర్డ్ కార్ల అమ్మకాల్లో తగ్గుదల


నిన్నటితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రముఖ కార్ల కంపెనీ ఫోర్డ్ తన అమ్మకాల్లో 38.28 శాతం క్షీణతను చూపించింది. గత ఏడాది మార్చి నాటికి 12,150 కార్లు అమ్మగలిగిన ఫోర్డ్ ఈ ఏడాది 7,449 కార్లను మాత్రమే అమ్మగలిగింది. దేశీయ అమ్మకాలు, ఎగుమతుల్లో కూడా తగ్గుదల నమోదైనట్టు కంపెనీ ప్రకటించింది.

అయితే, ఈ తగ్గుదల తాత్కాలికమేనని, త్వరలోనే అమ్మకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కార్ల విక్రయరంగంలో ప్రస్తుతం పోటీ విపరీతంగా ఉన్నా, మార్కెట్లో తమ బ్రాండ్ విలువ పెంచుకోవడంలోనూ, రెండు కొత్త ఉత్పత్తులు మార్కెట్లో ప్రవేశ పెట్టడంలోనూ విజయం సాధించామని ఫోర్డ్ వెల్లడించింది.   

  • Loading...

More Telugu News