: కడచూపుకు తరలి వచ్చిన అభిమానులు
వైఎస్సార్సీపీ నేత శోభానాగిరెడ్డి అంత్యక్రియలకు అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చారు. అభిమాన నేతను కడచూపు చూసేందుకు వారంతా క్యూ కట్టారు. దీంతో రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో కారు ప్రమాదంలో మృతి చెందిన శోభానాగిరెడ్డి అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి.