: పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ అరెస్ట్
కెనడియన్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (20) మరోసారి అరెస్టయ్యాడు. అతడిని లాస్ ఏంజెలెస్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. జపాన్ నుంచి వస్తూ విమానాశ్రయంలో దిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతడిని కొన్ని గంటలపాటు విచారించారు. బీబర్ ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్నాడు. పోయిన జనవరిలోనూ అతడు అరెస్టయ్యి తర్వాత విడుదలయ్యాడు.