: డేటింగ్ చేశాడు... బెదిరించి దొరికిపోయాడు


అమెరికాలో ఓ తుంటరోడు డబ్బున్న పెద్దాయన కూతురికి ప్రేమ పేరుతో వల వేశాడు. అక్కడ డేటింగ్ సాధారణమే కదా! డేటింగ్ కూడా చేశాడు. ఇదంతా దోచుకుందామన్న పథకంలో భాగంగానే. తీరా డేటింగ్ ముచ్చట తీరాక డబ్బులిస్తారా? ఆ ఫొటోలు బయటపెట్టాలా? అంటూ అసలు కుట్ర బయటపెట్టాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. అమెరికాలో ప్రముఖ భారతీయ పెట్టుబడిదారుడు, సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్ ఖోస్లా కూతురికే ఈ సమస్య ఎదురైంది. ఆయన కూతురు నైనా స్టాన్ ఫోర్డ్ వర్సిటీ గ్రాడ్యుయేట్ అయిన 27ఏళ్ల డగ్లస్ టార్లోతో రెండేళ్లపాటు డేటింగ్ చేసింది. ఆ సందర్భంగా తీసిన చిత్రాలను ఆన్ లైన్ లో పెడతానని బెదిరిస్తూ డగ్లస్... మెయిల్స్, ఫోన్ మెస్సేజీలు పంపాడు. ఒకసారి పెట్టాక వాటిని ఇక ఎవరూ తొలగించలేరని బెదిరించాడు. 72వేల డాలర్లు ఇవ్వాలని కోరాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ బీఐ అధికారులు రంగంలోకి దిగి డగ్లస్ ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News