: హీరోయిన్లంతా అతనికే ప్రచారం
టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్లుగా వెలుగు వెలిగిన వారంతా ఇప్పుడు ఒక్క వ్యక్తికే ప్రచారం చేస్తున్నారు. ఆయనెవరో కాదు టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య. జనగాం నియోజకవర్గం ప్రచారంలో బిజీగా ఉన్న పొన్నాలకు మద్దతుగా ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ మిత్రపక్ష ఆరెల్డీ నేత జయప్రద, కాంగ్రెస్ నేతలు జయసుధ, విజయశాంతిలు జనగాం చేరుకుని పార్టీ అధ్యక్షుడి ప్రచారంలో తళుక్కుమంటున్నారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు పొన్నాలను విమర్శల్లో ముంచెత్తుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా ఆయనపై విమర్శలు చేస్తున్నారు.