: ఐఏఎఫ్ బకాయిలు చెల్లిస్తానంటున్న దేవగౌడ
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్)కు పద్దెనిమిదేళ్ల కిందట తాను చెల్లించాల్సిన బకాయిలు ఇప్పుడు తీర్చేందుకు మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవెగౌడ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యవర్తిత్వం ద్వారా తాను చెల్లించాల్సిన వాటిని సెటిల్ చేస్తానని చెప్పారు. ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తన అనధికారిక పనుల కోసం గౌడ తమ ఎయిర్ క్రాఫ్టులను ఉపయోగించుకున్నారని, అందుకు గానూ ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించలేదని 2010లో ఐఏఎఫ్ దావా వేసింది. అసలు చెల్లించాల్సిన రూ.54 లక్షలకు గానూ వడ్డీతో కలిపి అవి రూ.2 కోట్లు అయ్యాయి.