: ఐపీఎల్ లో సన్ 'రైజ్' సాధ్యమేనా!?
డెక్కన్ చార్జర్స్.. ఐపీఎల్ చరిత్రలో ఓ ముగిసిన కథ! ఆ స్థానంలో హైదరాబాద్ ఫ్రాంచైజీగా ఐపీఎల్ యవనికపై అడుగిడనున్న సన్ రైజర్స్ తాజా సీజన్లో అదృష్టం పరీక్షించుకోనుంది. ఆటగాళ్ళలో అత్యధికులు డెక్కన్.. జట్టులో ఉన్నవాళ్ళే అయినా నూతన యాజమాన్యం, కొత్త కోచింగ్ సిబ్బందితో 'సన్ రైజర్స్ హైదరాబాద్' జట్టు ఐపీఎల్ ఆరవ సీజన్ లో తనదైన ముద్ర వేయాలని ఉవ్విళ్ళూరుతోంది.
కాగా, 2009లో ఐపీఎల్ చాంపియన్స్ గా నిలవడమొక్కటే డెక్కన్ చార్జర్స్ చరిత్రలో మేలిమిఘట్టం. ఆ తర్వాత దారుణమైన ఆటతీరుతో నానాటికీ తీసికట్టు.. తరహాలో దిగజారింది. నష్టాల కారణంగా డెక్కన్.. యాజమాన్యం చేతులెత్తేయడంతో ఐపీఎల్ పాలక మండలి ఆ ఫ్రాంచైజీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో దక్షిణాదిన ప్రముఖ టీవీ సంస్థ 'సన్ టీవీ' హైదరాబాద్ ఫ్రాంచైజీని చేజిక్కించుకుంది. వెంటనే సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది.
కొత్త కోచ్ గా టామ్ మూడీ, బౌలింగ్ కోచ్ గా పాకిస్తాన్ రివర్స్ స్వింగ్ స్పెషలిస్ట్ వకార్ యూనిస్ లను నియమించింది. ముఖ్యమైన ఆటగాళ్ళను అట్టిపెట్టుకుని, జట్టు బలహీనపడకుండా జాగ్రత్త వహించింది. అదే సమయంలో, వేలంలో, అక్కరకొచ్చే ఆటగాళ్ళను దక్కించుకునేందుకు భారీ మొత్తాలు చెల్లించేందుకు సైతం వెనకాడలేదు.
ఇక ఐపీఎల్ ఎల్లుండి ప్రారంభవనున్న నేపథ్యంలో జట్టు బలాబలాలను ఓసారి పరికిస్తే.. బ్యాటింగ్ కంటే సన్ రైజర్స్ బౌలింగ్ ఎంతో బలంగా కనిపిస్తోంది. ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ డేల్ స్టెయిన్ ఫామ్ లో ఉండడమే కాకుండా పూర్తి ఫిట్ నెస్ సాధించి ఉత్సాహంతో ఉరకలేస్తున్నాడు. అతనికి మరో ఎండ్ నుంచి సహకరించేందుకు టీమిండియా ప్రధాన పేసర్ ఇషాంత్ శర్మ, యువ బౌలర్ సుదీప్ త్యాగి ఉండనే ఉన్నారు.
ఇషాంత్ ఇటీవలే ఆసీస్ తో సిరీస్ లో కీలక సమయాల్లో వికెట్లు తీయడంతో పాటు పొదుపుగా బౌలింగ్ కూడా చేసి ఆకట్టుకున్నాడు. ఇక లైన్ అండ్ లెంగ్త్ కు కట్టుబడి బంతులు విసరుతాడని సుదీప్ త్యాగికి మంచి పేరుంది. స్పిన్ విషయానికొస్తే.. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా జట్టుకు కొండంత అండ. బ్యాట్స్ మెన్ ను తికమకపెట్టే గూగ్లీలు విసరడమే కాదు, బౌలర్లను చికాకుపెట్టే బ్యాటింగ్ చేయడమూ మిశ్రాకు తెలుసు. లోకల్ స్పిన్నర్ అక్షత్ రెడ్డి తన రంజీ ఫామ్ ను ఐపీఎల్ లోనూ చాటితే జట్టు ప్రస్థానం నల్లేరుపై నడక కాగలదు.
బ్యాటింగ్ విభాగాన్ని పరిశీలిస్తే, కెప్టెన్ కుమార సంగక్కర రాణింపుపైనే భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉంటాయి. మెరుపు ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో తొలి మ్యాచ్ కు దూరం అవనున్న సంగతి తెలిసిందే. దీంతో, మరో ఓపెనర్ పార్థివ్ పటేల్ పై బౌలర్లను చితక్కొట్టే బాధ్యత పడనుంది. మిడిలార్డర్ లో సంగక్కర, ఆసీస్ ఆజానుబాహుడు కామెరాన్ వైట్ లు తమ వంతు ప్రదర్శన చేస్తే లీగ్ దశను అధిగమించడం సన్ రైజర్స్ కు పెద్ద కష్టం కాబోదు.
కాగా, గత జట్టులో లోపించిన సమష్టి తత్వాన్ని సన్ రైజర్స్ గనుక పాటించితే ఐపీఎల్ తాజా సీజన్ లో మెరుగైన ప్రదర్శన ఇవ్వడం సాధ్యమేనని క్రికెట్ పండితులంటున్నారు. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో మనకు పసందైన క్రికెట్ విందు ఖాయంగా కనిపిస్తోంది. లెటజ్ ఎంజాయ్!!.