: శిక్షణ కోసం వెళితే.. జిమ్ ట్రైనర్ అత్యాచారం


ఆరోగ్యం కోసం, శారీరక సౌష్టవం కోసం జిమ్ లో ఎక్సర్ సైజ్ చేద్దామని వెళ్లిన యువతి అన్యాయానికి గురైంది. శిక్షకుడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దక్షిణ ఢిల్లీలోని సరోజినీ నగర్ కు చెందిన 30 ఏళ్ల ఓ మహిళా వ్యాపారి కొన్ని నెలల క్రితం స్థానికంగా ఓ జిమ్ లో చేరింది. జిమ్ నిర్వాహకుడు తరుణ్ ఆమెకు శిక్షణ ఇస్తున్నాడు. ఇటీవల ఓ రోజు శిక్షణ కోసం జిమ్ కు వెళ్లిన ఆమెకు తరుణ్ మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన తర్వాత ఆమెకు లోకం తెలియకుండా పోయింది. ఆ సమయంలో తరుణ్ ఆమెపై అత్యాచారం చేశాడు. స్పృహ వచ్చాక ఎవరికీ చెప్పొద్దని, చెబితే చంపేస్తానని బెదిరించాడు. అయినా ఆమె ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితుడు తరుణ్ ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News