: దమ్ముంటే సమాధానం చెప్పు కేసీఆర్: జైరాం రమేష్
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామంటూ చెప్పుకుంటున్న కేసీఆర్... రెండు స్థానాల్లో ఎందుకు పోటీచేస్తున్నారని కేంద్ర మంత్రి జైరాం రమేష్ ప్రశ్నించారు. ఓటమి భయంతోనే ఆయన రెండు చోట్ల పోటీచేస్తున్నారని చెప్పారు. మెదక్ జిల్లా రామచంద్రాపురంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో జైరాం మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.