: మోడీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా: జేపీ
మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ రోజు ఉదయం వనస్థలిపురంలోని పనామా జంక్షన్, ఎన్జీవోస్ కాలనీ, బీఎన్ రెడ్డి నగర్, రెడ్ వాటర్ ట్యాంక్ ప్రాంతాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ, బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి లోక్ సత్తా సంపూర్ణ మద్దతు తెలుపుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ లోక్ సత్తా అభ్యర్థి దోసపాటి రాము కూడా పాల్గొన్నారు.