: శంషాబాద్ వద్ద రూ.6 కోట్లు స్వాధీనం
బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న రెండు ప్రైవేటు బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్న రూ.6 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద జాతీయరహదారిపై ఎస్.వో.టీ అధికారులు ఉదయం చేసిన తనిఖీల్లో ఈ నగదు బయటపడింది. నగదును స్వాధీనం చేసుకుని రెండు బస్సులను సీజ్ చేసి సైబరాబాద్ కమీషనరేట్ కు తరలించారు. నగదును తరలిస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సి.వి. ఆనంద్ తెలిపారు.