: రెండు చోట్లా నరేంద్ర మోడీదే గెలుపు: రాజ్ నాథ్ సింగ్
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గుజరాత్ లోని వడోదరాలోనూ, ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలోనూ విజయం సాధించడం ఖాయమని బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా మోడీకి అభినందనలు తెలియజేశారు. దేశంలో మోడీ హవా లేదన్న ప్రధాని మన్మోహన్ సింగ్ మాటలను రాజ్ నాథ్ సింగ్ కొట్టిపారేశారు.