: జగన్, ఎమ్మార్ కేసు నిందితులు మళ్లీ జైలుకే


వైఎస్ జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్ కేసుల్లో నిందితులు రిమాండుల మీద రిమాండులకు గురవుతున్నారు. ఇప్పటివరకు ఈ కేసుల్లో నిందితులకు పలుమార్లు నాంపల్లి సీబీఐ కోర్టు రిమాండు విధించింది. అయితే నేటితో రిమాండు గడువు ముగియడంతో పోలీసులు వారిని కోర్టు ఎదుట హాజరుపరిచారు. రెండు కేసుల్లో విచారణ ఇంకా ఓ కొలిక్కి రాలేదని విచారణ సందర్భంగా సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. దీంతో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, బ్రహ్మానందరెడ్డి, సునీల్ రెడ్డి రిమాండును ఈ నెల 8 వరకు కోర్టు పొడిగించింది.

  • Loading...

More Telugu News