: విశాఖను అన్ని రంగాలకు అనుకూలంగా తీర్చిదిద్దుతా: వెంకయ్య నాయుడు


విభజన అనంతరం విశాఖ ప్రాధాన్యం గణనీయంగా పెరుగుతోందని, ఈ ప్రాంతాన్ని ఐటీ, పర్యాటక, చలనచిత్ర రంగాలకు అనుకూలంగా తీర్చిదిద్దుతామని బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు ప్రకటించారు. ఇండస్ట్రియల్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ డెవలప్ మెంట్ ఫోరం సభ్యులు నిర్వహించిన సమావేశానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ ప్రాంతంలోని వేలాది మంది నిపుణులకు ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని ఆయన పేర్కొన్నారు. విశాఖ, చెన్నై రీజియన్ ను గ్రోత్ కారిడార్ గా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News