: మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న మృతి
కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే మసాల ఈరన్న అనారోగ్య కారణాలతో ఈ రోజు మృతి చెందారు. మూడు సార్లు ఈయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాకుండా ఒకసారి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా పనిచేశారు. మంత్రాలయం మఠంలోకి దళితుల ప్రవేశం కోసం ఈయన తీవ్రంగా కృషి చేశారు.